16 May (16.05.) (138)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 16 May

మనుషుల వెంట ఎంత పడితే వారు అంత దూరము అవుతారు. భగవంతుని వెంట ఎంత పడితే భగవంతుడు అంత దగ్గర అవుతాడు.
The more you follow people, they go that far. The more you follow God, God gets that much closer.


137) భేద భావము తొలగ జేయుము (16.05)

భేద భావము తొలగ జేయుము
బ్రహ్మానందము కలుగ జేయుము
భావమందున గాన మందున నిలచి

మమ్ముల నుద్దరింపుము

బాబా సాయి నా బాబా సాయి //భేద//

1. సత్యమేదోతెలియజేయుము
నిత్యమందున నిలిపివేయుము
భక్తి యను భత్యమును వేయుము
ముక్తి పదమును వాస వేయుము //భేద//

2. అణువు అణువున నీవు గలవను
అనుభవముల కలుగ జేయుము
ఆత్మ జ్ఞానము పొంద గలిగెడి
మార్గ మందున నడువ జేయుము //భేద//

3. సుఖము దుఃఖము లనెడి భావన ఎన్నడైనను
కలుగ జేయకుము సుఖము దుఃఖములనెడి
భావనలన్నీ దాటెడి స్థితికి చేర్చుము సచ్చిదానందంబు
నందున శ్యామచరణుని ముంచి వేయుము //భేద//



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)