2 May (02.05.) (123)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 2 May

హారతి - నాలుగు వేళలలో మన యొక్క ఆర్తులను, తప్పులను, ఏమి పాడు పనులు చేసాము అని ప్రార్థించాలి. 

123) సాయీ - రామా- రామా -కావ రావా

సాయీ - రామా- రామా -కావ రావా //సాయి//

1. నీ కోసమై కనులు వెదకి వెదకి
చాలా అలసి పోయినవయ్యా దేవా
కరుణాంతరంగ నా కనుల కగపడ రావే
ప్రేమగా నిమిరి నను దీవించరావే // సాయి //

2. జీవించ లేక నీ పంచ చేరగా
ప్రాకు లాడుచు నుంటి దేవా
ప్రాపంచికములగు కోర్కెలను
దనుమాడి సచ్చిదానందము నీవా // సాయి //

3. జపము చేయగ లేని తపము
చేయగ లేని సోమరిగ నుంటినో దేవా
సర్వభారములు నీ పరము జేసుకొని
శామాదుల ప్రేమతో కావరావే //సాయి //




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)