15 May (15.05.) (135)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 15 May

ఏ పని చేసినా "అవసరమా? అనవసరమా?" అని ప్రశ్నించుకుని చేయాలి. (మాట్లాడేటప్పుడు అయినాసరే, ఏదైనా కొనేటప్పుడు అయినాసరే)
What ever work we do that should be questioned "Is it necessary?, Is it unnecessary? (Even when talking, when buying anything). 


136) బాబా నిను నమ్ముకుంటి (15.05)

బాబా నిను నమ్ముకుంటి నీకే మ్రొక్కుచు నుంటి
ప్రేమ గాచెదవన నీవే నా శరణ మంటి
బాబా శ్రీ సాయి బాబా //బాబా//

1. సత్యమునే బలుక కుంటి- ధర్మమున నడవకుంటి
దానముల చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

2. సచ్చింతన చేయకుంటి - సన్మార్గము నడవకుంటి
సత్సంగము చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

3. నీ లీలల చదవకుంటి - ధ్యానము చేయకుంటి
భజనలో పాల్గొన కుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

4. మోసంబుల చేయుచుంటి - మోహంబున తిరుగుచుంటి
మహాత్ముల జూడకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

5. మనసును నిలపకుంటి- మమతలను విడవకుంటి

మాయలను దాటుకుంటి- ఎందుకో నేనిట్లుంటి //బాబా//

6. తల్లివై లాలించు - తండ్రివై నను పోషించు
గురుడవై నను నడిపించు - దైవం బై దరిజేర్పించు //బాబా//

7. పాపముల జేయనీకు- పెడమార్గముల బోవనీకు
పర దూషణ జేయనీకు - సచ్చింతన వదల నీకు //బాబా//

8. దైవ ప్రేమను బెంచి - ఈర్ష్యాసూయల ద్రుంచి
నీ బంటుగా నన్ను గావించి - కరుణించు వరము నిచ్చి //బాబా//

9. సాయి నామది నివసించు- నీ నామమునే పలికించు
నీ చరితమునే చదివించు - నీలోన నన్నిమిడించు //బాబా//

10. నిష్ట సబూరుల బెంచు -నీ సేవల చేయగ నుంచు
సంతోషములో నన్నుంచు - నీ సన్నిధి నా కందించు //బాబా//

11. నాలోన మాయను ద్రుంచు -మమతానురాగము
పెంచు నాకు సద్గతులందించు - సన్మార్గముతో నడిపించు //బాబా//

12. దోసంబుల సంహరించు - పాపంబుల పరిహరించు
నీ పాద భక్తిని బెంచు - నీలో నన్నైక్యమొనరించు //బాబా//

13. దుర్గుణములను పోగొట్టి- అసత్యమును మానిపించి
మంచిగ నను నీవు బెంచి - నీతి నియమాలను బోధించి //బాబా//

14. పరాకు జేసే వేల - కరుణించి కాపాడవేల
జాగు సేయ కోపమేల - నను బ్రోవ వేగ రావేల //బాబా//

15. నీ రూపమును జూడగలేదు- నీ సమాధిని దర్శించగలేదు
నీ చరితమును చదవగలేదు- నీ నామమునే వినగలుగుదు //బాబా//



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)