9 May (09.05.) (130)
శ్రీ శారాద శ్యామ సందేశం: 9 May
మహాత్ములు చెప్పిన
విషయాలు, సూక్తుల ప్రకారం ఆచరించడమే పారాయణం. బుద్ధి వికాసం దీనిపై ఆధారపడి
ఉంటుంది. ఈ సూక్తులు ఎల్లప్పుడూ మననం చేయాలి. అప్పుడు అవి బుద్దిలో
స్థిరముగా కూర్చుంటాయి. బుద్ధి వికాసానికి భగవంతుడిని స్తుతి చేయాలి.
Recitation
is the practice of following the sayings of the sages, the Intellectual
development depends on it. These sayings should always be memorized.
Then they sit firmly in the mind. Praise the God for the development of
the mind.
130) ప్రేమ తోడ గావుమయ్యా
ప్రేమ తోడ గావుమయ్యా పరమాత్మ సాయి నీ పద పంకజములే నమ్మియున్న వారమనీ ప్రేమగ మము గావుమయ్యా పరమాత్మ సాయి //ప్రేమ// 1. ప్రతిక్షణము నీ నామమే మా మనసుల పలుకుచుండ అనుక్షణము నీ రూపమే మా కనులలో కదలు చుండ అహరహము నీ దయయే మమ్మెలర నడుపు చుండ క్షణక్షణమూ నీ కరుణయే మా కభయము నొసగు చుండ //ప్రేమ// 2. బాధ్యతల నేమో అధికము జేసి మా మనసుల కెంతో బాధల కలిగించి దారి తెలియక దిరుగు చుండగా కూర్చొని హాయిగా నవ్వుచూ వున్నావు ఇపుడి దేహమున కెందుకో బాధల కల్పించుచూ వున్నావు నీవే దిక్కని నమ్మిన వారమనుచు ఆ బాధల తొలగించుము సాయి //ప్రేమ//
Comments
Post a Comment