25 May (25.05.) (146)

 శ్రీ శారద శ్యామ సందేశం: 25 May

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గములందురు. ఇవి బహు ప్రమాదములను, నీచజన్మలను కలిగించును. ఎలాగైనా వీటిని విసర్జించవలయును.
Lust, anger, greed, fascination, Ego, jealousy are called Six internal enemies. These can cause multiple accidents and worst births. These should be discarded anyway. 

146) శరణము శరణము రామా సాయి (25.05)

శరణము శరణము రామా సాయి
నీ దివ్య చరణమే శరణము సాయి //శరణము//

1. మ్రొక్కెద మ్రొక్కెద రామా సాయి
మోద మలర మము గావుము సాయి //శరణము//

2. వేడెద వేడెద రామా సాయి
వేదనలను తొలగించుము సాయి //శరణము//

3. పూజించద పూజించద సాయి
పుణ్యాత్ములలో కలుపవే సాయి //శరణము//

5. అర్చించెద అర్చించద సాయి
అనవరతము నను బ్రోవుము సాయి //శరణము//

6. ధ్యానించద ధ్యానించెద సాయి
దరైశన మొసగుము దత్త గురు సాయి //శరణము//

7. సేవించద సేవించెద సాయి
సమాధి నిష్ట నోసంగుము సాయి //శరణము//

7. వినుతించెద వినుతించెద సాయి
వినయ వివేకముల పెంచుము సాయి //శరణము//

8. విశ్వాసంబును పెంచుము సాయి
నిష్ఠ సబూరుల బెంచుము సాయి //శరణము//

9. నుతియించెద నుతియించెద సాయి
సద్గదులను కలిగించవే సాయి //శరణము//

10. ప్రార్ధించెద ప్రార్ధించెద సాయి
పరమ పదము నా కొసగవే సాయి //శరణము//

11. సమర్థ సద్గురు దేవా సాయి
శ్యామచరణ సన్నుత శ్రీ సాయి //శరణము//





Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)