20 May (20.05.) (141)

 శ్రీ శారద శ్యామ సందేశం:

గాలిని తీసుకుని వదలడం జరిగినంత సహజముగా నీకు ఎవరితో లేక దేనితో సంబంధం ఉంటే అది ఆత్మానుబంధం. ఇంద్రియాతీతమగు శ్రీగురు బంధము ఆత్మా నుబంధం. ఎవరితోనైనా, దేనితోనైనా ఇంద్రియాతీతమగు బంధం ఉంటే అదే దైవమనే భావనతో, పవిత్రముగా కలకాలము కాపాడుకొనుటయే మన కర్తవ్యం.
If you have a relationship with someone or something that is as natural (easy) as taking the breath, it is soul-intimacy. The transcendental bond with Guru is the soul-bond. If there is a transcendental bond with anyone or anything, feel that is God, and It is our duty to keep that sacred for eternity.

141) వ్యర్థపు యోచన లెందుకు మనసా (20.05)

వ్యర్థపు యోచన లెందుకు మనసా
వ్యామోహంబులు ఎందుకె మనసా
నిరతము చింతన చేయుచు నుందువు
జనన మరణ చక్రంబున నుందువు //వ్యర్థపు//

1. పంచ భూత సమ్మేళ మగునది దేహంబని నీ వెరుగుదువే
పుట్టుట గిట్టుట లన్ని జీవులకు సహజంబని నీ వెరుగుదువే
అశాశ్వతంబౌ ఆస్తి సంపదలు మోహమయంబని దెలియుదువే
దెలిసి దెలిసియు దెలివి లేక పెడ మార్గములందున దిరిగేదవే //వ్యర్ధపు//

2. ఆశయే సర్వ దుఃఖంబులకు మూలంబని
నీ వెరుగుదువే అహంకార మమకార పరంపర

లంధకారమని దెలియదువే దెలిసి దెలిసియూ
దెలివి లేక పెడమార్గము లందున దిరిగేదవే //వ్యర్థపు //

3. పరబ్రహ్మమున మనసును నిలుపగ ప్రయత్నించవే మనసా
సత్య ధర్మ పధ గమనము లందున సాగుచుండవే మనసా
నిష్ట సబూరుల గలిగి యుండి నిజ మార్గము తెలియవే మనసా
శ్యామ చరణ సన్నుతుడగు సాయిని సతతము దలచవే మనసా //వ్యర్థపు//




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)