1 May (01.05.) (122)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 1 May

బుద్ధికి స్వేచ్ఛనివ్వాలి. ఆహార విహార వ్యవహారాల విషయంలో బుద్దికి స్వేచ్ఛను ఇస్తే అది మనలను ఎలా నడుచుకోవాలో మనకు చెప్తుంది. బుద్ధి ‘నిర్ణీత' అయినప్పుడు మనసుకు స్వేచ్చ ఉండదు. అప్పుడు న్యాయంగా ధర్మబద్ధంగా చేస్తాము.
The mind must be freed. Giving the mind freedom in the matter of Food, Excursion, affairs tells us how to behave. When the mind is ‘determined’ the Heart has no freedom. Then we will do it fairly righteously.

122) నీదు లీలలు నేరుగ జాలను

నీదు లీలలు నేరుగ జాలను
సగుణ నిర్గుణ రూపా సాయి
నెరుగ జాలని శ్యామను
కరుణతో బ్రోవ వేడెదను బాబా సాయి //నీదు//

శరణు సద్గురు దేవా సాయి-
పాహి సద్గురు దేవా సాయి. //నీదు//

1. శివ భక్తులకు శివుడవు నీవే
రామ భక్తులకు రాముడ నీవే
హనుమ భక్తులకు మారుతి నీవే
కృష్ణ భక్తులకు రంగడి నీవే //నీదు//

2. చూడ గలిగిన వారికి అంతట
దరిశన మొసగిడి దైవము నీవే
వినగలిగిన వారికి మధురముగా
మాటల వినిపింతువు నీవే // నీదు //

3. ఎవరే తీరుగ కొలచిన వారిని
ఆయా తీరుల గనే గా చెదవు
ప్రాణికోటికి పరమాప్తుడవు
పవిత్రాత్మలకు పరమాత్ముడవు //నీదు//



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)