7 May (07.05.) (128)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 7 May

సాధన నిరంతర ప్రయాణం. గమ్యం చేరే వరకు వెనుతిరిగి చూడరాదు. గమ్యము ఎంత దూరం ఉందో తెలియదు. గమ్యం చేరిన తర్వాత మిగిలినది ప్రారబ్దం మాత్రమే. మహాత్ములు ప్రారబ్దం అనుభవిస్తూ ఆగామి రాకుండా చూసుకుంటారు. చివరకు ఏమీ మిగలదు.

Practice is a continuous journey. Don't look back until you reach your destination. Not sure how far the destination is. Once the destination is reached, the rest is only the Experience. The Mahatmas feel the onset and take care of the future. In the end nothing is left. 


128) నీ నామము వినుటయే నా భాగ్యము

నీ నామము వినుటయే నా భాగ్యము
నీ రూపము జూచుట నా పుణ్యము
నీ నామము స్మరించుట యే జ్ఞానము
నీ రూపము ధ్యానించుటయే మోక్షము //నీ నామము//

1. నామము వినగ మనసు కలగదు
రూపము జూడగ బుద్ధి నిలువదు
నామ స్మరణకు తీరిక కలుగదు
ఎందుకిట్టుల జేతువో
ఎందుకీ వీధి ఆడించెదవో
దోషములన్నియు దయతో మన్నించి
కనికరముతో నను గావుము సాయి //నీ నామము//

2. అనేక యిడుముల కలిగించెదవు
వాటిని తొలగించగ నిను ప్రార్థించెదను
లౌకిక విషయము లందు నిలిపెదవు
పరమార్థమునకు జేరనీయవు //నీ నామము//


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)