5 May (05.05.) (126)

శ్రీ శారాద శ్యామ సందేశం: 5 May

గురువు లేక ఎవరూ దేనినీ సాధించలేరు. వారి వారి అర్హతలను బట్టి గురువు అర్థము అగును. పరబ్రహ్మమే గురువుగా అవతరించిననూ, జీవుల యొక్క సంస్కారములను బట్టి, ఆలోచనలు, భావాలకు అనుగుణంగా భగవత్ శక్తి వారి వారికి ఆయా విధములుగా అర్థం అగుచుండును.

No one can achieve anything without a Guru. According to their qualifications, they will understand Guru. Even though Parabrahma himself became a guru, Beings accordance to their rites, thoughts and feelings in that ways God power will understand to them. 


126)  నీ సేవకునిగ నీ బానిసగ
నీ సేవకునిగ నీ బానిసగ

నీ సేవలోన నిరతము

నిలుపుము సాయి //నీ సేవ//

1. సర్వము నీ కర్పణ జేయుచు


సకలము నీదే యని మది దలచుచు


సకల విశ్వమున నిన్ను జూచుచు


సంతోషంబును పొందగ జేయుము //నీ సేవ//



2 . నీ నామామృత పానము జేయుచు


నీ లీలలను గానము జేయుచు


నీ సేవకులకు సేవలు జేయుచు


నిరతము సంతస మందున నుంచుము //నీసేవ//



3 . ఆశయ మీవై ఆశలు నీవై


ఆచరణ ఆలోచన నీవై


అంతట నీవై అన్నియు నీవై


ఆనందమున నిలుపుము సాయి //నీ సేవ//



4. నీవే నేనై నేనే నీవై


నిశ్చయ నిశ్చల మనుగతి నేనై


నిరూపమానంద ధామము నేనై


నుండగ జేయుము శ్యామ సన్నుత //నీ సేవ// 




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)