21 May (21.05.) (142)
శ్రీ శారద శ్యామ సందేశం: 21 May
142) వలదయ్యా - నను వదలకు మయ్యా (21.05)
వలదయ్యా - నను వదలకు మయ్యా
పాపాత్ముడనని నాపై కోపము //వలదయ్యా //
1. పవిత్రతయు యిసుమంతయు లేదని
పరమ భక్తి నలుసంతయు లేదని
సదాలోచనలు సుంతయు లేవని
సదా చరణ శూన్యంమని - అలుక //వలదయ్యా //
2. దురాచారుడని దుర్మార్గుడనని
సాధు పోషణలు సేవలు లేవని
సమయాను కూలముగ నుండునని
స్వార్థ పరాయణుడని - అలుక //వలదయ్యా //
3. ధర్మ న్యాయముల దలచు ననుచుననీ
నీతి నియమముల పాటించనని
సత్య మార్గమున సంచరించని
సజ్జన దూషణ జేయుదుననీ - అలుక //వలదయ్య //
4. సద్గురువులను సరకు జేయనని
సత్సంగముల పాల్గొనననీ
సద్భక్తుల సహవాసము లేదని
సద్భాషణలను జేయనని - అలుక //వలదయ్య //
5. పూర్వ పుణ్యమున నిన్ను దలచితిని
రక్షించెదని మది నమ్మితిని
నీ దరికి లాగ నిను శరణంటిని
శ్యామదేవుని కరుణించ మంటినని - అలుక //వలదయ్య//
Comments
Post a Comment