12 May (12.05.) (133)
శ్రీ శారాద శ్యామ సందేశం: 12 May
133) పాపికి నిష్కృతి ఎన్నడు ? (12.05)
పాపికి నిష్కృతి ఎన్నడు ? నీ పద సన్నిధిని చేరు టెన్నడు? పతితునిగా ఈ పవిత్ర భువి లో మసలుచు నుండెడి మందభాగ్యుడగు- ఈ- //పాపి// 1. తలచున దొకటి చెప్పేడి దొకటి చేసేడి దొకటిగ బ్రతుకుచు నుండెడి అహము మోహముల ఈర్ష్యాసూయల తోడ దుర్భాష లాడుతూ నుండెడి //పాపి// 2. కామముతోడ కన్నులు గానక కనరాని పనులు చేయు చుండెడి మహితాత్ములగు దైవ భక్తులను హీనముగా పరికించు చుండెడి //పాపి // 3. అధర్మ మన్యాయములతో నడుచుచు ఆస్తి కొరకు ఆరాటము చెందెడి స్వార్ధము కొరకై నయ వంచనముతో నరులను బహుగ పొగడుచుండెడి //పాపికి // 4. పుణ్యము సంపాదించుట కొరకై భక్తి శూన్యమగు పూజలు చేసి పలువుర లోన భక్తుడు వీడని నటియుంచు చుండెడి //పాపికి // 5. పూజల చేయగ సేవల చేయగ నీ దయ కొరకై చూచుచు నుండెడి దానధర్మముల చేయక సతతము సద్గతి నందక అభిలషించెడి //పాపికి// 6. ప్రేమభావమున ప్రాణుల జూడక శ్రీ గురుదేవుని ఆశ్రయించక శ్రీ గురుదేవుల ఆదేశములను అణుమాత్రమైన ఆచరించక సత్ఫలితములనే సదా కోరుచు స్వార్థ చింతనతో నడుచుచుండెడి శ్రీ గురుదేవుని కృపను కోరెడి హీన మనస్కుడగు శ్యామచరణుడు //పాపికి //
Comments
Post a Comment