Posts

Showing posts from June, 2022

(182) 30 June (30.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 30 Jun మనకు ఏది మంచిదో అది భగవంతునికి బాగా తెలుసు కదా! మనకు మంచిదేదో దానిని చేయమని, దానికి విఘ్నములు కలిగించే పని చేయకుండా ఉండేటట్లు చేయమని ఆ తండ్రిని ప్రార్థిస్తే మనకు జరిగేదంతా మన మంచికే అని తెలుస్తుంది. అనేక అనుభవములు కలిగి మనకు ఈ విషయం బాగా అవగాహనకు వస్తుంది. God knows best what is good for us! If we pray to the Father to do what is good for us and not to do anything that would hinder us, then we will know that everything that happens to us is for our good only. With many experiences we come to understand this very well.

(181) 29 June (29.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 29 Jun చదవటం నీ వంతు. దేవుడు ఏదిస్తే దానిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవడము, అపరిమితమైన దుఃఖానికి కారణమవుతుంది. It's your turn to read. What God gives you must be willing to do that work. To be like this before, to be supposed to be like that, causes immense grief.

(180) 28 June (28.06.)

Image
శ్రీ శారాదా శ్యామ సందేశం: 28 Jun ఇతరులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరిలో ఏమి ఉందో మనకు తెలియదు. నేను ఇక్కడకు వచ్చాను. ఇంక ఎవరు రాలేదు కదా అని గొప్పగా (అహంకారం) భావించకూడదు. భగవంతుడి సంకల్పం అలా ఉంది. ఆయన అనుగ్రహం వలన వచ్చాము అని భావించాలి. వారికి సమయం వచ్చినప్పుడు వారు వస్తారు. మనం కొన్ని సంవత్సరాలు సాధన చేసినరానిది వారికి కొన్ని రోజుల్లోనే రావచ్చును. Never underestimate others. We do not know what is in them. I reached here, no one else has come. So don't feel great (arrogance). That is the will of God. We must think that we came by His grace. They will come when the time comes for them. What we have got in a few years may come to them in a few days.  

(179) 27 June (27.06.)

Image
శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jun ఈ సృష్టిలో వ్యర్థమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కదాని వలన ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. చీమల లాగా నిరంతరం కృషిచేయడం, ఈగ లాగా ఎప్పుడు బాహ్యంగా, అంతరంగాను, పరిశుభ్రంగా ఉండటం, కుక్క లాగా విశ్వాసంతో పడి ఉండటం, ఈ మూడు సాధకునికి ఉండవలసిన ముఖ్యలక్షణములు. There is nothing waste in this creation. Each one has a use for something. Like ant Constantly working hard, like fly outwardly internally being hygiene, like dog having faith, these three are the hallmarks of the practitioners.  

(178) 26 June (26.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jun మానవుడిగా పుట్టడం వలన ఉపయోగం ఏంటి? మనము ఎందుకు బతుకుతున్నాము? కేవలం తినడము, నిద్రపోవడము, పిల్లల్ని కనడము, వాళ్ళను పెంచడము ఇదేనా మన ధ్యేయం? అలా అయితే జంతువులకు, చెట్లకు మనకు తేడా ఏమిటి? జంతువులు, చెట్లు - అవి అయినా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి. మన వల్ల ఎవరికి ఉపయోగం? మార్కోనీ రేడియోను కనుగొన్నాడు. ఇట్ల గొప్ప గొప్ప వాళ్లు ప్రజలకు ఉపయోగపడు పనులు చేయిస్తున్నారు కదా! వాళ్ళు చేయగలిగింది మనము ఎందుకు చేయడము లేదు? వాళ్ళు మనలాంటి మానవలే కదా! మన లక్ష్య ఏమిటి? సాయి తాతయ్య, రమణ తాతయ్యగారి లాగా మనం ఎందుకు ఉండలేక పోతున్నాము? మనం అందరం ఆ భగవంతుడి నుండి వచ్చాము కాబట్టి తిరిగి భగవంతుని చేరవలసిందే. భగవంతుని చేరడం మన లక్ష్యమైనప్పుడు మిగిలిన విషయాల మీద కోరికలు, ఆశలు, వ్యామోహాలు ఎందుకు? వాటివలన ఉపయోగం ఏమి? మన లక్ష్యాన్ని చేరుకోలేము కదా! విషయవాసనలను(కోరికల మీద మమకారం) మనంతట మనము తొలగించుకోలేము. గురువు సహాయం లేనిదే వాటి నుండి బయటపడలేము. What is the use of being born human? Why do we live? Is our goal just to eat, sleep, to give birth to children, and raise th...

(177) 25 June (25.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jun సమస్త జీవరాశికి సమ్మతమైనదే నిజమైన మతము. పరిపూర్ణ అహింస అసంభవం. అలలు ఉన్న దాంట్లో స్నానం చేస్తే దోషాలు పోతాయి. మీరు ప్రకృతిని గౌరవిస్తూ పోతే ప్రకృతి మనకు సహకరిస్తుంది. దేహ భ్రాంతి, ప్రాణ భీతి పోవాలంటే సద్గురువును సమాశ్రయించి, వారు చెప్పినట్లు చేయాలి. ప్రతి పనీ భగవంతుడిదే అనుకుని చేయాలి. The true religion is the one that is acceptable to all living beings. Absolute nonviolence is impossible. Bathing in a rippled water will get rid from the Errors. If we go by respecting nature, nature will support. In order to get rid of body delusion and fear of life, one should consult a  Truthful-Guru and do as he is told. Should feel every work belongs to God and do it.

(176) 24 June (24.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jun ఎవరైనా బయటి నుంచి వస్తూనే ప్రేమగా పలకరించి మంచి నీళ్లు, కాఫీ, టీలు ఇవ్వాలి. ఏమి అలా ఉన్నావు అని ప్రేమగా అడగాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే అందరి హృదయాలు గెలవాలి. ఈ నియమాన్ని పెట్టుకుని జీవించటం వలన మంచికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. అవకాశం కోసం కాచుకుని ఉండాలి. చేశామని ఉండరాదు. మనిషి సఖ్యతగా ఉండాలి. అర్హత యోగ్యత సంపాదించుకోవాలి. When someone come from outside greet them warmly and give them good water, coffee, tea. You have to ask lovingly how are they. To have the grace of God means to win the hearts of all. Living by this rule will result in good. Must wait for the opportunity. There should be no feeling of being we did. The man must be in harmony. Must be eligible and qualify. 176) సాయి ! నన్ను బ్రోవ భారమా! (24.06.) సాయి ! నన్ను బ్రోవ భారమా ! రామ సాయీ ! నన్ను బ్రోవ భారమా ! శివ సాయీ ! నన్ను బ్రోవ భారమా ! కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా ! శ్యామ సాయీ నన్ను బ్రోవ భారమా ! ॥సాయి॥ మంచి చెడుగులను బేధము - మదినెంచక యుండుట నేరమా ॥సాయి॥...

(175) 23 June (23.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jun ఒక విషయం కొత్తగా తెచ్చి పెట్టుకుంటే పాతది పోతుంది. (మంచి, చెడు) - పెట్టెలో 10 రకాల వస్తువులు ఉన్నాయి. దానిలో 2 కొత్తవి చేర్చాలంటే 2 పాతవి బయటికి తీయాలి. When a new thing is brought in, the old is lost. (Good, bad) - There are 10 types of items in the box. In order to add 2 new ones in it 2 old ones have to be taken out. 175) సాయియే నా గానము  (23.06.) సాయియే నా గానము - సాయియే నా ధ్యానము సాయి నా మానము - సాయియే నా ప్రాణము ॥సాయి॥ (1) సాయియే నా స్మరణము - సాయియే నా మరణము సాయియే ఆభరణము - సాయియే నా భరణము ॥సాయి॥ (2) సాయియే నా గేయము- సాయియే నా కాయము సాయియే నా భావము - సాయియే నా జీవము ॥సాయి॥ (3) సాయియే సద్భావము-  సాయియే నా దైవము సాయియే నా భోగము- సాయియే నా యోగము ॥సాయి॥ (4) సాయియే భవ రోగము - సాయియే నా రాగము సాయియే మమకారము- సాయియే సత్కారము ॥సాయి॥ (5) సాయియే నిర్వికారము - సాయియే సహకారము సాయియే నీ నామము - సాయియే నా కామము ॥సాయి॥ సాయియే నా సేమము - సాయియే ఆరామము సాయియే జయ సాయిరాం - సాయియే శ్యామ్ సాయిరాం ॥సాయి॥

(174) 22 June (22.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 22 Jun మోహము - వ్యామోహము - డబ్బు, నగలు, చీరలు ఇన్ని పెట్టుకుని నేనేం చేస్తాను? ఇన్ని అవసరమా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవాలి. Fascination - What do I do with so much money, jewelry, saris? This much needed? Questions should be asked. It should be used as long as it can useful. We must criticize ourselves. 174) సాంబ సదాశివ సాయి శంభో (22.06.) సాంబ సదాశివ సాయి శంభో అభివాదయే అహంభో ॥ సాయి ॥ (1) త్రిగుణా తీతా త్రిమూర్తి రూపా కాలాతీతా కాల స్వరూపా మోహాతీతా మోహన రూపా భావాతీతా భావ స్వరూపా ॥సాయి॥ (2) జ్ఞానాతీతా జ్ఞాన స్వరూపా నాదాతీతా నాదస్వరూపా రాగతీతా రాగ స్వరూపా లోకాతీతా లోకస్వరూపా ॥సాయి॥ (3) సుజన మనోహర సుందర శుభకర మృత్యుంజయ హర మదన విదూర ధర్మ ప్రియాంకర దత్త దిగంబర భక్తవ శంకర భువన విహారా ॥సాయి॥

(173) 21 June (21.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 21 Jun పిసినారితనము - ఇది పోగొట్టుకోవాలంటే దానగుణం అలవరచుకోవాలి. ఆ దానం చేయునప్పుడు ఈ డబ్బు వాళ్లకు ఉపయోగమా, కాదా? అని ఆలోచించి చేయాలి. Parsimony: If you want to lose it, you have to adopt charity. When they donating, Is this money useful to them, or not? Should think and do it. 173) సాయి శరణం ౼ సద్గురు శరణం (21.06.) సాయి శరణం సద్గురు శరణం సమర్థ సద్గురు సాయిరామ్ శరణం శ్రీ సాయి శరణం సద్గురు శరణం సమర్థ సద్గురు చరణం ౼ శ్రీ సాయి దేవా ౼ దేవాధి దేవా ౼ దివ్య ప్రభావా ౼ నన్నేల రావా తల్లివి నీవై , తండ్రివి నీవై గురు దైవమీవై నను బ్రోవరావా నా దిక్కు నీవై , నా మ్రొక్కు నీవే, నా చిక్కులను దీర్ప వేగమె రావే ౼ ॥ పాపము నెరుగను, పుణ్యము నెరుగను , పాపము నందున నను ద్రోయ బోకే అధర్మ మెరుగను , ధర్మము నెరుగను ౼ అధర్మ మందు నన్నుంచ బోకే , అసత్య మెరుగను ౼ సత్యము నెరుగను అసత్య వాదిగ నన్ను జేయ బోకే ॥ దానము నెరుగను జ్ఞానము నెరుగను జ్ఞాన దానముల నన్నుంచరావే ౼ ॥ దోసము లైనను మోసము లైనను జేయంగ నీయక నను గావగ రావే ఎందు నే నున్న ఏ వేళనైనా ౼ నీ రూప ధ్యానము  జేయంగ నీవే ౼ ॥ ఎట...

(172) 20 June (20.06.)

Image
శ్రీ శారాదా శ్యామ సందేశం: 20 Jun భగవత్తత్వము గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్లు తెరవాలనిపించదు. లీనమైతే ఏడుపొస్తుంది. సాధన మొదలు పెట్టుకుంటే అదే నడిపిస్తుంది. రాని దాని కొరకు రచ్చల పడనేల. తెలుసుకొని అన్నా చేయి, చేస్తూ అన్నా తెలుసుకో. ఊరకే చేయొద్దు. Thinking about God-philosophy, doesn't makes you to open eyes. If immerse, we get crying. if you start practicing, the same only leads you.. Don't worry about unknown thing, do after knowing or while doing know, don't do without purpose. 172) సాయి రామా దేవ నాపై దయను జూపవే (20.06.) సాయి రామా దేవ నాపై దయను జూపవే దయను జూపవే సాయి దరికి జేర్చవే ॥ సాయి ॥ (1) నీచుడనూ అజ్ఞానుడ ననీ దోసములను జేసినాడనని దలచి నను దూరము జేయకు దయానిధే సాయి రామా (2) సక్రమమగు నడతయే లేదని సత్య భాషణయే లేదని సబూరియు నిష్టయు లేవని నన్ను  దూరము జేయకు తండ్రి (3) సోమరిగ బ్రతుకు చుంటినని బాధ్యతలను గమనించననీ బాధలలో వేడు చుంటినని నను దూరము జేయకు స్వామీ (4) నీ నామమే దలచుచు నుంటిని నీ కథలనే జదువుచు నుంటిని నీ లీలలను బలుకుచు నుంటిని నీ పూజల జేయు చుంటినని నీవు మెచ్చు...

(171) 19 June (19.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 19 Jun వ్యామోహం అంటే శారీరక వ్యామోహం కాదు. తిండి మీద, బట్టల మీద ఉన్న వన్నీ వ్యామోహములే. అవన్నీ పరిశీలించుకుంటే చాలు. ఒక్క మెట్టు ఎక్కినా చాలు. మిగతావన్నీ స్వయంచాలకంగా ఎక్కుతాం. Obsession means not physical obsession, On food, On clothes, on all things are called Obsession. If we examine it all, one step is enough, to automatically climb all steps. 171) సాయిరామ ప్రభో ౼ సాయిరామ ప్రభో (19.06) సాయిరామ ప్రభో ౼ సాయిరామ ప్రభో సాయిరామ ప్రభో సాయి మమ్మేలు శ్రీ సాయి కృష్ణా ప్రభో ॥సాయి॥ సాయి కృష్ణ ప్రభో సాయికృష్ణ ప్రభో సాయి మమ్మేలు శ్రీ సాయి శామ ప్రభో ॥సాయి॥ సాయి శ్యామప్రభో సాయి శ్యామ ప్రభో సాయి మమ్మే లు శ్రీ సాయిరామ ప్రభో ॥సాయి॥ (1) స్వార్థ చింతన తప్ప అన్య చింతన లేక  జీవించు చుంటిని శ్రీ సాయి రామ ప్రభో (2) సుఖ దుఃఖముల లోన పొంగి కృంగుచు నుండు మనసు కలిగిన వాడ శ్రీ సాయిరామ ప్రభో (3) నీతి నియమము లేని భక్తి శ్రద్దలు లేని బ్రతుకు లాగుచు నుంటి సాయి రామ ప్రభో (4) లోకము నందు గల వ్యామోహముల యందు  తగులుకొని యున్నాను సాయిరామ ప్రభో (5) ఆచరణయే లేని ఆలోచన...

(170) 18 June (18.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 18 Jun మంచి నుంచి చెడుకి వెళ్తే మనసు అంగీకరించదు. ఎప్పుడూ మంచి చేస్తుంటే చెడు చేయలేవు. మంచి చేయకుండా ఉండలేవు. అందువలన చెడు పోతుంది. If you go from good to bad, mind will not accept. If always doing Good means you can't do Bad. Can't stop doing good. Thus bad will go away. 170) సారధిని నీవే సాయి    (18.06.) సారధిని నీవే సాయి శ్యామ సారధివి నీవే సాయి ॥సారధి॥ (1) ఎచ్చటనో పడి యుండడి వారిని  ముచ్చట గొలుపగ ముందుకు ద్రోయుచు ముద్దు మురిపముల ప్రేమల ముంచుచు నీ వారలనెడి బిరుదుల నోసగడి ॥సారధి॥ (2) ఏమిటేమిటో జేయుచు నుందువు  అటు నిటు ద్రిప్పుచు జూచచు నుందువు అంతు తెలియని సంసారంబుధి నందు ముంచుచు దేల్చుచు నందువు ॥సారధి॥

(169) 17 June (17.06.)

Image
శ్రీ శారాదా శ్యామ సందేశం: 17 Jun మనిషికి శత్రువు ఎవరు?  నేను-నాది అనేది శత్రువు. ఎవరైనా నీకు బుద్ది లేదు అని తిడితే ఊరుకుంటామా? లేదు. మళ్లీ తిరిగి, నీకే లేదు అంటాము. అలా కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి కదా! అతని రూపంలో నీలో తప్పు తెలుపుతున్నాడని అనుకున్నప్పుడు అతనితో నీకు శత్రుత్వం ఉండదు. Who is the enemy of man? I-mine is the enemy. If someone scolds, You don't have mind? You would be calm? No. In reverse we only say that you don't have that. Instead of that, God is omnipresent know! when you think he is pointing out your mistake in his form, then you have no enmity with him. 169) సాయి దత్త శ్యామా రామా   (17.06.) సాయి దత్త శ్యామా రామా  రంగ ధామా బల భీమా హనుమ నామ సద్గుణ ధామా  జయము సాయి రామా ॥సాయి॥  (1) శిరిడీ యందు నివసించి  జగముల నెల్ల పాలించి సృష్టి స్థితి లయ కారక శక్తివి  నీవే ననుచూ దెలిపిన సాయీ ॥సాయి॥ (2)  మతముల భేదము మనుషుల కేనని  సమ్మతమే నీ సహజ గుణమనీ  సద్భక్తులకు సంతస మొసగీ  సద్గుతుల నొసగి గాచిన సాయీ ॥...

(168) 16 Jun (16.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 16 Jun మనసు మధ్యన ఉంటుంది. దాని చుట్టూ ఈ శరీరం కవచంలా ఉంటుంది. భగవంతుడికి మనకు మధ్య అడ్డంకులు పాపాలు. మనం ఎందుకు గొప్పవాళ్ళము కాలేక పోతున్నాము? ఉల్లిగడ్డను పైనుంచి ఒక్కొక్క పొర తీసేస్తే చీవరకు ఏమీ మిగలదు. అలాగే మనలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను తొలగించుకుంటే ఏమీ ఉండవు. The Heart is in the middle. This body is a shield around it. The barriers between us and God are sins. Why we are not becoming can't great? Peel an onion layer by layer then there is nothing in it. Similarly, if we get rid of lust, anger, greed, fascination, ego and jealousy, there will be nothing. 168) సన్నుతి జేయరా సాయి రమణా    (16.06.) సన్నుతి జేయరా సాయి రమణా కరుణతో నన్ను మంగళ చరణా ॥సన్నుతి॥ (1)  సతతము నీదగు దివ్య నామమును  స్మరణము జేయుచు నుంటిని దేవా కలలో నైనా నీ దరిశనమును ఒసగి బ్రోవుమా ప్రేమ స్వభావా ॥సన్నుతి॥ (2) జేసితిని ఎన్నో దోసములనూ  దండన జేయకుమని ప్రార్థింతును  నీ పాదములే శరణు మంటిని  నీవే దిక్కని బ్రతుకుచు నుంట...

(167) 15 June (15.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 15 Jun బావిలోని నీరు తోడుకోవాలంటే ఆ విధానం తెలుసుండాలి. ఆ విధానం చెప్పే వారు గురువు. అర్హత సంపాదించుకోవాలి. అనుభవంతో తత్వము గురించి తెలుస్తుంది. అమ్మ అంటే ఆకారం కాదు. అది తత్వము. ఇలా భగవంతుని యందు ఉండాలి. From well to get water, you need to know the procedure. Those who say that approach are called Guru. Must qualify for that. Knowing the philosophy with experience. Mother does not mean shape. That is the philosophy. This is how we should be near God.  167) సాయి సద్గురు దేవా నాపై    (15.06.) సాయి సద్గురు దేవా నాపై  కనికరంబును జూపుమా దయతో నా హృదయంబు నందున  నిలచి పాలన జేయుమా ॥సాయి॥ (1) సతతంబు నీదు పాద దాసుల తోడ చెలిమిని గూర్చుమా సద్గుణంబుల, భక్తి ,శ్రద్దల తోడ బ్రతుకగ జేయుమా సత్య, ధర్మ పధంబు లందున సాగునటుల దీవించుమా  సకల విశ్వమునందు నీదగు విశ్వరూపము జూపుమా  ॥సాయి॥ (2) అహము మోహము లందు ద్రోయక నేర్పుగా నడిపింపుమా  కామ, క్రోధ, లోభాది గుణముల కలుగ నీయక గావుమా ఎల్లవేళల సాయి నామ స్మరణ మనసున నిలుపుమా సర్వ ...

(166) 14 June (14.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 14 Jun మాట, ప్రవర్తన, ఆలోచన సక్రమంగా ఉండాలి, ఉంచుకోవాలి . మనసు, మాట, చేతల్లో ఒకటే ఉండాలి. అంటే త్రికరణశుద్ధి. భగవంతుడిని నమ్ముకుని చెడిపోయినవాడు లేడు. ఆలోచనా విధానం మారితే మాట మారుతుంది. ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. పుణ్యం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. పాపం ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి. Speech, behavior, and thought have to be and should be kept in order. The mind, the word, the deeds it must be the same. I.e. Three-characteristic-purity. No one was corrupted, by believing in God. The word changes when the way of thinking changes. Talk carefully with everyone. We do not know when we will die. Be careful every moment. Good ideas come if there is virtue. If sin is there, then bad thoughts will come.  166) సాయి సాయి (మోహన కళ్యాణి రాగం )    (14.06.) సాయి సాయి సాయి  సాయి సాయి యనవే మనసా....... (1) సాయి సాయి యని సాయి సాయి యని  సతతము దలచవే మనసా..... ...

(165) 13 June (13.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 13 Jun అంతరంగము ప్రేమతో నిండినప్పుడు ఆవేదన నివేదనగా మారడమే పూజ. When the inner being is filled with love, grief changes to gift That is Adoration. 165) సాయి నామమను మధురామృతమును  (13.06.) సాయి నామమను  మధురామృతమును గ్రోలగ రండి జనులారా..... ॥సాయి॥  శాంతి సౌఖ్యముల నందు కొనుచు  ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥ (1) దైహిక బాధల దాడి నెరుంగని  స్థితిని జేరుడో జనులారా.....  లౌకిక వాంఛల లయలు తప్పుకొని  స్థిరతను బొందుడు జనులారా... ॥ శ్రీ సాయి॥ (2) కాంత కనకపు కామ మోహముల  వలలో బడకుడు జనులారా...  శాంతి కొరకు శ్రీకాంతుని మదిలో చింతన జేయుడు జనులారా.... ॥ శ్రీ సాయి॥ (3) ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల గలిగి యుండుడో జనులారా..... శ్యామ చరుణు నీ సూక్తులను ఆసక్తిగ  వినుడో జనులారా.... ॥ శ్రీ సాయి॥

(164) 12 June (12.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 12 Jun తల్లి, తండ్రి, గురువు, దైవములను మరిపించి అన్నీ తానే, అన్నింటికీ తానే అనెడి మధురానుభూతిని కలిగించే ఆనందమును, ఆత్మ, స్థైర్య, ధైర్యములను ప్రసాదించి అపారమగు మనశ్శాంతిని అందించగల వారే మన గురుదేవుడు. అటువంటి వారిని ఆశ్రయించిన తర్వాత వారు చెప్పినది చేయడమే మన కర్తవ్యము. అదే ఆనందమునకు మూలము. By forgetting the mother, the father, the teacher, the deities and make it all, all by himself and Gurudev causes sweet feelings of bliss, soul-steadfastness, courage and gives us incomprehensible peace of mind. After resorting to such one's. It is our duty to do as they say. It is the source of the happiness.  164) సచ్చిదానంద సాయినాథా !  (12.06.)   సచ్చిదా నంద సాయినాథా ! సజ్జన పోషక గురునాథా ॥ ఆనంద నామా సాయినాథా ! పరమా నంద రూపా గురునాథా ॥ త్రిగుణా తీతా సాయినాథా ! త్రిమూర్తి రూపా గురునాథా ॥ దత్త దిగంబర సాయినాథా ! ధర్మ స్వరూపా గురునాథా ॥ దారిద్ర్య నాశక సాయినాథా ! దివ్య స్వరూపా గురునాథా ॥ నందలాల సాయినాథా ! శ్యామ సన్నుత గురునాథా ॥

(163) 11 June (11.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 11 Jun సృష్టి కార్యక్రమంలో మనకున్నదంతా ఇతరులకు పంచేటంత వరకు జన్మలు తప్పవు. అందుకే గురువు అర్హత యోగ్యత కలిగిన వారి కొరకు తాపత్రయపడుతూ ఉంటారు. గురువు అనే భావంతో ఎంతమంది శుద్ధిగా విశ్వసించి ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటారో వారు జన్మరాహిత్యం పొందే వరకు గురువుకు జన్మలు తప్పవు. In Creation process, births will be there until we share with others all that we have. That is why the Guru is eagerly waiting for those who are qualified. No matter how many people who are pure believers in the feel of Guru and follow his commands, till their salvation, Guru also takes births.  163) సాయి ! సాయి ! శ్రీ సాయీ సాయీ సాయీ !  (11.06.) సాయి ! సాయి ! శ్రీ సాయీ సాయీ సాయీ !  శ్రితజన ఆయీ సాయి ! సాయి ! ద్వారకా మాయీ  సాయి బాబా !సాయిబాబా ॥సాయి॥ (1) భక్త జనావన సాయీ సాయీ  ముక్తి విధాయక సాయీ సాయీ అగణిత గుణ గణ సాయీ నిగమాంత స్థిత సాయి సాయీ కరుణాత్మక సాయీ సాయీ దారిధ్యాత్మక సాయీ సాయీ  కరుణాత్మక సాయీ సాయీ  ధీర విహారా సాయీ సాయీ అనంత రూపా సాయ...

(162) 10 June (10.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 10 Jun ప్రతిదినము పడుకునే ముందు ఆ రోజు జరిగిన కార్యక్రమములు జ్ఞాపకము చేసుకొని వ్రాసుకొనవలయును. మరునాడు చేయవలసిన కార్యక్రమములను క్రమపద్ధతిలో నిర్ణయించుకుని వ్రాసుకొనవలయును. వ్రాసుకున్న దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.  సోమరితనము మహమ్మారి. వ్యాధులకంటే బలమైనది. జన్మను, వృత్తిని, మిగిలిన అన్ని కార్యక్రమములను సర్వనాశనం చేసి, శరీరమును, మనసును, చిత్తమును, బుద్ధిని నశింపచేయుము. Every day before going to bed you should remember and write down the activities of that day. The next day, the activities to be done should be decided systematically and written down. Behave in accordance with what is written.   Laziness is the pandemic and Stronger than diseases. It destructs birth, occupation, all other activities and destroys body, mind, memory and intellect.  162) సాయిరామా..... సాయిరామా ( సద్గురు దేవా )  (10.06.) సాయిరామా..... సాయిరామా సద్గురు దేవా..... సాయిరామా దత్త గురు కృష్ణ శివరామా మారుతి విఠలా రంగనామా ॥సాయి॥ (1)...

(161) 9 June (09.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 9 Jun ఎన్ని శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, శ్రుతులు, స్మృతులు, వ్యాకరణాదులు చదివి ప్రజలచే అపరిమితమగు మెప్పును పొందగలిగేటట్లు వివరించగలిగినా, ఉపన్యసించగలిగినా, రాయగలిగినా, శ్రీ గురుని యందు త్రికరణశుద్ధితో భక్తి కలిగి వినయంతో, ఓర్పుతో ఆరాధించిన వారికి శ్రీగురుకృప వలన పొందగలిగే ఆనందము వర్ణనాతీతము. శ్రీ గురుని సంబంధమే నిజమగు సత్సంగము. మిగిలినవన్నీ వ్యర్థములు, పతనహేతువులు. No matter how many sciences, legends, poems, melodies, memories, grammars can be read, in a way infinite way they can be explained, lectured or written.... On Sri Guru who have purely devotion with humility and patience admiring him, by his grace can obtain indescribable joy. The True-companionship (Satsang) is the real relationship with Sri Guru. Everything else is rubbish, and indicators of the falling.  161) శ్రీ సాయి రామ నామ మహిమను  (09.06.) శ్రీ సాయి రామ నామ మహిమను  చక్కగ దెలియుము మనసా ! ఘన సంసారంబుధి దాటగ జేసెడి  మధుర నామమే మనసా ! శ్రీ సాయి...

(160) 8 June (08.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 8 Jun మనము తనను తెలుసుకోలేమని తెలుసుకున్న పరమాత్మ, తన వారిని ఉద్దరించుటకై తానే ఒక శరీరమును ధరించి, మన మధ్య సంచరించి, తరింపజేస్తారు. కానీ, ఆయన మన మధ్య ఉన్నప్పుడు గుర్తించగలిగే శక్తి కొన్ని కోట్లలో ఏ ఒక్కరికో ఉంటుంది. కరుణామయుడైన శ్రీ గురుడు మన అందరినీ ఆ ఒకనిగా చేయుగాక! God realised that We don't understand him. To empower his own people he wore a body, wandering among us to enable us. But the power to recognize him when he is among us can be done by one among few crores. May the merciful Sri Guru make us all unified!  160) హే కరుణా భరణా దయానిధే (08.06.)   హే కరుణా భరణా దయానిధే కల్మష హరణా కృపానిధే కరుణా భరణా కల్మష హరణా దయానిధే కృపానిధే  హే కరుణా భరణా ..... 1. భౌతిక వాసనలో  పడియుంటిని ఆధ్యాత్మికతకు ఆశపడితిని  భౌతికమునకు ఆధ్యాత్మికతకూ బంధము నెరుగక కుములు చుంటిని ॥ హే కరుణా భరణా ॥ 2. ఒకపరి నీవున్నావనె ధైర్యము  ఒకపరి తెలియని దేదో అధైర్యము కలుగుచు నా మది చంచల మగును  అశాంతితోడ అలమటింతును  ॥ హే కరుణా...

(159) 7 June (07.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 7 Jun సోమరితనము సాధనకు మహమ్మారి. ప్రతిక్షణము భగవన్నామస్మరణతో గడపడమనేది ప్రయత్నిస్తూ, సత్సంగము, సత్పురుషులతో ఉండడం వలన మనకు తెలియకనే ఆనందమార్గంలో పయనిస్తూ శ్రీ గురుని కృపను పొందగలిగే యోగ్యతను పొందుతాము. Laziness is the disease for achievement. Trying to spend time with the remembrance of the Lord, and by being with True-companionship and virtuous people, without knowing we walk on the path of bliss, we gain the merit of being able to receive the grace of Sri Guru.  159) ఇది కల కాదు  (07.06.) ఇది కల కాదు కల్లా కానే కాదు  ఇది ఆనంద నిలయము కరుణాలయము  ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము  ఇది మా అందరి పాలిట ప్రేమాలయము దివ్య ప్రేమాలయము కరుణాలయము  మన కరుణాలయము సాయి కరుణాలయము 1. సతమతమౌ నటుల చేయు  పిచ్చియోచనలతో  వికలము  కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో  తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన  తరియించగ తపియించుచు నీదరి చేరినదానా  బాల ననుచు బేలననుచు  జాగుచేయ...

(158) 6 June (06.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 6 Jun చెడును తొలగించుకో, మంచి మిగిలించుకో. సద్గురువును సమాశ్రయించు. చెడు, మంచి నశించి అందవలసినది అంది పొందవలసినది పొందగలవు. ఆనందదాయకము, భగవత్ విభూదులను పొందగలవు. Eliminate the bad, keep aside the good. Recourse the Guru. The bad and the good perish and will get what you deserve. Happiness, God delights can be obtained.  158) సాయి రామా ---- సాయి రామా (06.06.) సాయి రామా ---- సాయి రామా  సద్గురు దేవా --- సాయి రామా  దత్త గురు కృష్ణ శివరామా  మారుతి విఠల రంగనామా //సాయి// 2. ఏమి పుణ్యముల చేసితిమో ఏయే నోముల నోచితిమో నీ పదములనే నమ్మితిమి  నిను  దైవముగా పొందితిమి //సాయి// 3. సన్మార్గంబుల నడిపించి  సచింతనలను కలిగించి  సద్గతులను నా కొసగ గదే  శ్యామచరణ సన్నుత శ్రీ సాయీ //సాయీ//

(157) 5 June (05.06.)

Image
శ్రీ శారాదా శ్యామ సందేశం: 5 Jun తల్లి తన పని చేసుకోవడానికి పిల్లలు అడ్డం వస్తే బొమ్మలు ఇచ్చి మరిపించి తన పని తాను చేసుకుంటుంది. బొమ్మలు కాదని తల్లే ఎత్తుకోవాలని ఏడిస్తే చంకలో పెట్టుకుని పని చేస్తుంది. అలాగే మన భర్త, పిల్లలు, కోరికలు, వ్యామోహలు మొదలగు వాటి యందు చిక్కుకొనక ఆ పరమేశ్వరుని యందు మనసు నిలిపినచో భగవంతుడు మనకు ముక్తి ప్రసాదించను. The mother to do her work, she gives toys to children and diverts them. And does her work herself. Not for toys, for mother only if they cry, she works by keeping them in the armpit. Like this if we not entangling our mind on our husband, children, desires, passions and so on, keep on that God. God will give us salvation.  157) శ్రీ సాయి రామ నామ మహిమను చక్కగా (05.06.) శ్రీ సాయి రామ నామ మహిమను  చక్కగా దెలియుము మనసా ! ఘన సంసారంబుధి దాటగ  జేసేడి మధుర నామమే మనసా ! శ్రీ సాయి నామమే మనసా !  శ్రీ రామ నామమే మనసా ! //శ్రీ // 2. సద్గురువుల చెంతకు నిను చేర్చును  చక్కగా నడుపును మనసా !  భోగభాగ్యముల సుఖసంపదలను...

(156) 4 June (04.06.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 4 Jun నీతిగా, ధర్మంగా ప్రేమగా ఉన్న వారి దగ్గరికి భగవంతుడే వస్తాడు. నిత్యమూ, నిరంతరమూ నామ స్మరణ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లల ప్రవర్తన ఉంటుంది. శిష్యులు చేసే ప్రతి ప్రక్రియ తమ గురువును ప్రతిబింబింప చేస్తుంది. God Himself comes to those who have ethics righteous love. The name should be memorized continuously and constantly. There will be children's behavior while looking at adults. Every process that the disciples do reflects their teacher.  156) శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా (04.06.) శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా శ్రీ వాణి మహేశ్వరి లలితాది శక్తి రూపా శ్రీ హనుమ కేశవ నరసింహ మహర్షి రూపా నాదు నమస్సుమాంజలుల నందుకో సాయి రూపా ఈ లోక మెల్ల సృజియించెడి దైవ మీవే పోషించు భారమును భరియించెడి దైవమీవే చిత్రాతి చిత్రముగ లయించెడి దైవమీవే నాదు ప్రణామముల నందు కొను దైవమీవే శరీర కంబులగు బాధల లెన్ని యున్న  మానసికంబుగ నశాంతు లెనియున్న విశ్వాస ముంచి 'బాబా 'యని దలచుకొన్న  సంతోషకరంబులకు సత్ఫలితము లోన గూడు గాదే

(155) 3 June (03.06.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 3 Jun మనం పూర్వజన్మలో మనకు మంచి విషయాలు చెప్పేవారు ఎవరూ లేరు అని ఎంతో మధనపడితే ఈ జన్మలో ఇటువంటి అవకాశం వచ్చింది. ఆ విషయాలను విని ఆచరిస్తే నీకు సద్వినియోగం అయినట్లు. అట్లు చేయకపోతే తర్వాత కోట్ల జన్మలెత్తిన అటువంటి సాంగత్యం దొరకదు. మనం చేసుకున్న పుణ్యం కాస్త తరిగిపోతుంది. దాన్ని ఆచరిస్తే మంచి జన్మలకు అవకాశం ఉంటుంది. ప్రతి నిమిషమూ నీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరిస్తూ ఉండాలి. అదే మనకు మార్గం చూపిస్తుంది. In our previous life, when we were so brewed that, there was no one who could tell us good things. Now Such an opportunity came in this life. If you hear and practice those things, you will benefit. If that is not done, later in birth crores no such association can be found . The virtue we have done will somewhat diminish. Practicing it will lead to better births. You have to remember your favorite divine name every minute. It shows us the way.  155) శిక్షయో - నీ శిక్షణ యో ! (03.06) శిక్షయో - నీ శిక్షణ యో ! పరిరక్షణయో సాయీ - ఇది నీ...

(154) 2 June (02.06.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 2 Jun జీవితంలో ప్రతి ఒక్కటి నిర్ణయింపబడి ఉంటుంది. ఉదాహరణకి 9-10 గంటలలోపు గుడికి వెళ్లాలి అని ఉంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు గుడికి వెళ్లి భగవన్నామస్మరణ చేస్తావా? లేదా గుడికి వచ్చిన వాళ్లతో లోకాభిరామాయణం చేస్తావా అన్నది మాత్రం నిర్ణయింపబడదు. అది నీవు నిర్ణయం చేయవలసిందే. Everything in life is determined. An example it would be you to go to the temple in between 9-10'o clock. But at that time in temple you chant name of God? Or whether you will do worldly gossips there. That is not decided. That is for you to decide. 154) శిరిడీ వాసా దీన జనావనా (02.06) శిరిడీ వాసా దీన జనావనా శాంతస్వరూపా సాయిరాం అభయ ప్రదాతా జ్ఞానప్రదాతా పావన చరిత సాయిరాం //శిరిడీ// 1. ఏసువు నీవే అల్లావు నీవే శివుడవు మాధవుడవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు దైవము నీవే మాయా జనిత ముని జన సన్నుతా మహిత చరిత సాయిరాం //శిరిడీ// 2. నిన్నే మదిలో నమ్మిన వారికి కష్టము లుండవు ఎన్నడూ నీ నామము జపించు వారికి పాపము లుండవు ఎన్నడూ యుక్తి ప్రదాతా భక్తి ప్రదాతా ముక్తి ప్రదాతా సాయిరాం //శిరిడ...

1 June (01.06.) (153)

Image
  శ్రీ శారద శ్యామ సందేశం: 1 Jun చిట్టి చిలకమ్మా: ఓ ప్రాణి జీవాత్మ! అమ్మ కొట్టిందా: ప్రకృతి మాత తట్టి లేపుతుంది అట కానీ మనం కనుక్కోలేము తోటకెళ్ళావా?: ఆధ్యాత్మిక తోటకెళ్ళావా? (బాబాగారి దగ్గరికి వెళ్ళటం లాంటిది) పండు తెచ్చావా?: అక్కడ జరిగిన ఆధ్యాత్మిక విషయాలు విని హృదయంలో పెట్టుకుని ఆచరించావా? గూట్లో పెట్టావా?: ఆ విషయాలు సాధన చేసి హృదయంలో పదిలపరచుకున్నావా? గుటుక్కు మింగావా?: ఆచరించి అవగాహన చేసుకున్నావా?  153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా (01.06) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా ప్రేమగ నను కావారా... సాయీశ్వరా‌//శ్రీకరా // గురుడవు నీవనీ, దైవము నీవనీ, గురువే దైవమని సత్యము ధర్మము సత్పధ మర్మము తెలుపగ వేడిమి నీ నామామృత పానము చేయుచు నీవే శరణమని పిలచి పిలచి నిన్ను కొలచి కొలచి నే నలసిపోయితిని లేరా దయను చూపి నీ దరిశన మొసగి హృదయ మందిరము నందు నిలువరా.. పలకరించరా //శ్రీకర // నిష్ట సబూరుల శిక్షణ నొసగగ ఇక్కట్టుల కలిగించితివా సుఖ దుఃఖములలో సమ భావము కలుగునటుల కరుణించితివా మొహంబు నెప్పుడు గూల్చెదవో మోదంబు నెపుడు గూర్చెదవో ఎటుల నీ దరికి జేర్చెదవో ఎప్పుడు నీలోన నిలిపెదవో నే నెరుగ లేను రా శ్యామ సన్నుతా...