(171) 19 June (19.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 19 Jun

వ్యామోహం అంటే శారీరక వ్యామోహం కాదు. తిండి మీద, బట్టల మీద ఉన్న వన్నీ వ్యామోహములే. అవన్నీ పరిశీలించుకుంటే చాలు. ఒక్క మెట్టు ఎక్కినా చాలు. మిగతావన్నీ స్వయంచాలకంగా ఎక్కుతాం.
Obsession means not physical obsession, On food, On clothes, on all things are called Obsession. If we examine it all, one step is enough, to automatically climb all steps.

171) సాయిరామ ప్రభో ౼ సాయిరామ ప్రభో (19.06)
సాయిరామ ప్రభో ౼
సాయిరామ ప్రభో
సాయిరామ ప్రభో
సాయి మమ్మేలు
శ్రీ సాయి కృష్ణా ప్రభో ॥సాయి॥

సాయి కృష్ణ ప్రభో సాయికృష్ణ ప్రభో
సాయి మమ్మేలు శ్రీ సాయి శామ ప్రభో ॥సాయి॥

సాయి శ్యామప్రభో సాయి శ్యామ ప్రభో
సాయి మమ్మే లు శ్రీ సాయిరామ ప్రభో ॥సాయి॥

(1) స్వార్థ చింతన తప్ప అన్య చింతన లేక
 జీవించు చుంటిని శ్రీ సాయి రామ ప్రభో

(2) సుఖ దుఃఖముల లోన పొంగి కృంగుచు నుండు
మనసు కలిగిన వాడ శ్రీ సాయిరామ ప్రభో

(3) నీతి నియమము లేని భక్తి శ్రద్దలు లేని
బ్రతుకు లాగుచు నుంటి సాయి రామ ప్రభో

(4) లోకము నందు గల వ్యామోహముల యందు
 తగులుకొని యున్నాను సాయిరామ ప్రభో

(5) ఆచరణయే లేని ఆలోచనలు లేని
 పథమున నేనుంటి సాయి రామ ప్రభో

 (6) తల్లి దండ్రి గురు దైవములు నీవనుచు
 బాగుగా చదివితిని సాయిరామ ప్రభో

(7) మనసు నందున అట్టి భావమే కలుగదు
 నా ప్రాప్త మేమొ మరి సాయిరామ ప్రభో ౼

(8) ఆత్మవే నీవనుచు పరమాత్మ నీవనుచు
 బాగుగా వింటిని సాయి రామ ప్రభో

(9) ఆత్మ పరమాత్మల తత్వంబు నెరుగని
 అల్పగ్నుడను నేను సాయిరామ ప్రభో

(10) ఆపదలలో నిన్ను తలచి నంతనే
గాచి రక్షింతు వందురు సాయిరామ ప్రభో

(11) ఆపదలలో నీవు గుర్తుకే రానట్టి
మంద బాగ్యుడనయ్యా సాయిరామ ప్రభో

(12) సతతంబు నీ నామ స్మరణే జేయంగ
 కోరు కొనుచుంటిని సాయిరామ ప్రభో

(13) స్మరణను జేయంగ మనసు కలుగుట లేదు
 ఎందు కిట్లగు చుండె సాయి రామ ప్రభో

(14) నీ మీదనే దృష్టి నిచ్చలముగా నిలిపి
నిను జూడ నెంచితిని సాయి రామ ప్రభో

(15) అది ఏమి కర్మమో దృష్టి నిలువగ లేదు
 నిను జూడ లేనైతి సాయి రామ ప్రభో

(16) బాధ్యతల నూహించ గుండె బరువై పోవు
 ఆవేదనల తోడ సాయిరామ ప్రభో

(17) నీ వుండగా నాకు భయమెందు కను భావ
 మిసు మంత కలుగదే సాయి రామ ప్రభో

(18) ఈర్ష్యౌ అసూయలను దూరముగా జేయు
 ఉద్దేశ్యమున్నది సాయి రామ ప్రభో

(19) గ్రహచారమేమొ మరి అవి వదల కున్నవి
 ఎంత విదిలించినా సాయి రామ ప్రభో

(20) నీ యంత స్థితికి నే జేరాలనే తపన
తీవ్రముగా నున్నది సాయిరామ ప్రభో

(21) ఏమీ తెలియగ లేని ఏమి చేయగ లేని
నాకెటుల గలుగునది సాయి రామ ప్రభో

(22) ధైర్యముగ జీవించి దైవమును భజియించి
 కీర్తించ నెంచితిని సాయి రామ ప్రభో

23) ధైర్యమే నశియించె ధైన్యమే మిగిలించె
దైవము నన్ను వంచె సాయి రామ ప్రభో

(24) వయసు పెరిగిన గాని మనసు పెరగగ లేని
మంద బాగ్యుడనయ్య సాయి రామ ప్రభో

(25) కరుణించమని మంచి మనసుంచమని నిన్ను
వేడుకొను చుంటిని సాయి రామ ప్రభో

(26) దోసము లోనరించు దుర్భాషలను బెంచు
గతిలోన నేనుంటి సాయి రామ ప్రభో

(27) కరుణించమని మంచి గతి నుంచమని నిన్ను
ప్రార్ధించు చుంటి శ్రీ సాయి రామ ప్రభో

(28)ఎంత జేసిన గాని ఏకాగ్రతయె లేక
నైరాశమున  నుంటి సాయి రామ ప్రభో

(29) దయతో నేకాగ్రతను దయ చేయమని నిన్ను
శరణు వేడితినయ్యా సాయిరామ ప్రభో

(30) దృష్టి నీపై నిలుపు నీ నామమే బలుకు
శక్తియే లేదయ్య సాయి రామ ప్రభో

(31) నా కనులలో నిలచి నా పలుకులలో నిలిచి
దయ జూప వేడితిని సాయిరామ ప్రభో

ఏది ఏమైననూ ఎటుల జరుగుచు నున్న
నీ అభయమె మాకు భయము తొలగించునని
నీ అండయె మాకు కొండంత ధైర్యమని
నీ కరుణయె మాకు శ్రీరామ రక్షయని
నీ నామమే మాకు మార్గము జూపునని
నీ ప్రేమయె మాకు శ్రేయము నొసగునని
నీ చూపులే మాకు పరమాత్మ జ్యోతి యని
నీ రూపమే మాకు సద్గతుల నొసగు నని
సతతంబు నా మనసు నందు నివసించుచు
సంత సంబుల నిచ్చి సాయిజ్యమును జేర్చ
పాహి శరణంటి శ్రీ సాయిరామ ప్రభో ౼ 


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)