(168) 16 Jun (16.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 16 Jun

మనసు మధ్యన ఉంటుంది. దాని చుట్టూ ఈ శరీరం కవచంలా ఉంటుంది. భగవంతుడికి మనకు మధ్య అడ్డంకులు పాపాలు. మనం ఎందుకు గొప్పవాళ్ళము కాలేక పోతున్నాము? ఉల్లిగడ్డను పైనుంచి ఒక్కొక్క పొర తీసేస్తే చీవరకు ఏమీ మిగలదు. అలాగే మనలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను తొలగించుకుంటే ఏమీ ఉండవు.
The Heart is in the middle. This body is a shield around it. The barriers between us and God are sins. Why we are not becoming can't great? Peel an onion layer by layer then there is nothing in it. Similarly, if we get rid of lust, anger, greed, fascination, ego and jealousy, there will be nothing.


168) సన్నుతి జేయరా సాయి రమణా  (16.06.)
సన్నుతి జేయరా సాయి రమణా
కరుణతో నన్ను మంగళ చరణా ॥సన్నుతి॥

(1)  సతతము నీదగు దివ్య నామమును
 స్మరణము జేయుచు నుంటిని దేవా
కలలో నైనా నీ దరిశనమును
ఒసగి బ్రోవుమా ప్రేమ స్వభావా ॥సన్నుతి॥

(2) జేసితిని ఎన్నో దోసములనూ
 దండన జేయకుమని ప్రార్థింతును
 నీ పాదములే శరణు మంటిని 
నీవే దిక్కని బ్రతుకుచు నుంటిని ॥సన్నుతి॥

(3) మానవుడను అమాయకుడను
మాయలోనే వున్నాడను
మంచి చెడుగులను దెలియని వాడను 
సత్కృప గావుము శ్యామ చరుణుడను ॥సన్నుతి॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)