(166) 14 June (14.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 14 Jun
మాట, ప్రవర్తన, ఆలోచన
సక్రమంగా ఉండాలి, ఉంచుకోవాలి . మనసు, మాట, చేతల్లో ఒకటే ఉండాలి. అంటే
త్రికరణశుద్ధి. భగవంతుడిని నమ్ముకుని చెడిపోయినవాడు లేడు. ఆలోచనా విధానం
మారితే మాట మారుతుంది. ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎప్పుడు
చనిపోతామో తెలియదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. పుణ్యం ఉంటే మంచి
ఆలోచనలు వస్తాయి. పాపం ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి.
Speech,
behavior, and thought have to be and should be kept in order. The mind,
the word, the deeds it must be the same. I.e.
Three-characteristic-purity. No one was corrupted, by believing in God.
The word changes when the way of thinking changes. Talk carefully with
everyone. We do not know when we will die. Be careful every moment.
Good ideas come if there is virtue. If sin is there, then bad thoughts
will come.
166) సాయి సాయి (మోహన కళ్యాణి రాగం ) (14.06.)
సాయి సాయి సాయి
సాయి సాయి యనవే మనసా.......
(1) సాయి సాయి యని సాయి సాయి యని
సతతము దలచవే మనసా.....
సాయి సాయి యన సకల బాధలు
సమసి పోవునే మనసా.... ॥సాయి॥
(2) సృష్టి స్థితి లయ కారకు డ తడను
సత్యము నెరుగవే మనసా.....
సర్వభారముల మోయున తడనే
సంగతి మరువకే మనసా..... ॥సాయి॥
(3) భక్తితోడ నీవు వెపుడు తలచినా
నీలో నిలుచునే మనసా.....
నిలచి నిన్ను సద్గతి పాల్జేయును
నిజము తెలియవే మనసా...... ॥సాయి॥
సాయి దాసుల గనవే మనసా.....
శామ చరణుని మనసా.....
Comments
Post a Comment