(176) 24 June (24.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jun
ఎవరైనా బయటి నుంచి
వస్తూనే ప్రేమగా పలకరించి మంచి నీళ్లు, కాఫీ, టీలు ఇవ్వాలి. ఏమి అలా
ఉన్నావు అని ప్రేమగా అడగాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే అందరి హృదయాలు
గెలవాలి. ఈ నియమాన్ని పెట్టుకుని జీవించటం వలన మంచికి ఎప్పటికైనా ఫలితం
ఉంటుంది. అవకాశం కోసం కాచుకుని ఉండాలి. చేశామని ఉండరాదు. మనిషి సఖ్యతగా
ఉండాలి. అర్హత యోగ్యత సంపాదించుకోవాలి.
When
someone come from outside greet them warmly and give them good water,
coffee, tea. You have to ask lovingly how are they. To have the grace of
God means to win the hearts of all. Living by this rule will result in
good. Must wait for the opportunity. There should be no feeling of being
we did. The man must be in harmony. Must be eligible and qualify.
176) సాయి ! నన్ను బ్రోవ భారమా! (24.06.)
సాయి ! నన్ను బ్రోవ భారమా !
రామ సాయీ ! నన్ను బ్రోవ భారమా !
శివ సాయీ ! నన్ను బ్రోవ భారమా !
కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా !
శ్యామ సాయీ నన్ను బ్రోవ భారమా ! ॥సాయి॥
మంచి చెడుగులను బేధము -
మదినెంచక యుండుట నేరమా ॥సాయి॥
కామ క్రోధాదుల తోడనూ -
కలహించి జీవించుట నా నేరమా ॥సాయి॥
దాన ధర్మంబులు జేయక
నీచ స్వార్థంబు నడతలు నేరమా ॥సాయి॥
ఈర్ష్య అసూయల తోడనూ -
భక్తులందరినీ దూరుట నేరమా ॥సాయి॥
తప్పులన్నీ తెలిసి కృంగుచూ
నీకు చెప్పుకొనుట ఘోర నేరమా ॥సాయి॥
చేయరాని పనులు చేసితి
మరి వినగరాని మాటలాడితి నని ॥సాయి॥
శ్యామదేవుని నన్ను దూరము జేయకుమని -
వేడుకొందును నిన్ను దైవమా ॥సాయి॥
Comments
Post a Comment