(169) 17 June (17.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 17 Jun
మనిషికి శత్రువు ఎవరు?
నేను-నాది
అనేది శత్రువు. ఎవరైనా నీకు బుద్ది లేదు అని తిడితే ఊరుకుంటామా? లేదు.
మళ్లీ తిరిగి, నీకే లేదు అంటాము. అలా కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి కదా!
అతని రూపంలో నీలో తప్పు తెలుపుతున్నాడని అనుకున్నప్పుడు అతనితో నీకు
శత్రుత్వం ఉండదు.
Who is the enemy of man?
I-mine
is the enemy. If someone scolds, You don't have mind? You would be
calm? No. In reverse we only say that you don't have that. Instead of
that, God is omnipresent know! when you think he is pointing out your
mistake in his form, then you have no enmity with him.
169) సాయి దత్త శ్యామా రామా (17.06.)
సాయి దత్త శ్యామా రామా
రంగ ధామా బల భీమా
హనుమ నామ సద్గుణ ధామా
జయము సాయి రామా ॥సాయి॥
(1) శిరిడీ యందు నివసించి
జగముల నెల్ల పాలించి
సృష్టి స్థితి లయ కారక శక్తివి
నీవే ననుచూ దెలిపిన సాయీ ॥సాయి॥
(2) మతముల భేదము మనుషుల కేనని
సమ్మతమే నీ సహజ గుణమనీ
సద్భక్తులకు సంతస మొసగీ
సద్గుతుల నొసగి గాచిన సాయీ ॥సాయి॥
(3) నిష్ఠ సబూరులె నిజమగు మార్గము
దయ దానంబులె దైవ భావమని
సకల జనులకు చక్కని బోధల
జేసి వారలను బ్రోచిన సాయి ॥సాయి॥
Comments
Post a Comment