(179) 27 June (27.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jun
ఈ సృష్టిలో
వ్యర్థమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కదాని వలన ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. చీమల
లాగా నిరంతరం కృషిచేయడం, ఈగ లాగా ఎప్పుడు బాహ్యంగా, అంతరంగాను, పరిశుభ్రంగా
ఉండటం, కుక్క లాగా విశ్వాసంతో పడి ఉండటం, ఈ మూడు సాధకునికి ఉండవలసిన
ముఖ్యలక్షణములు.
There is nothing waste in this
creation. Each one has a use for something. Like ant Constantly working
hard, like fly outwardly internally being hygiene, like dog having
faith, these three are the hallmarks of the practitioners.
దాసుడ నేన నేనయ్య
రమణ దయ గనుమ
భాస్కర సమతేజ వందనము
సుపధము తెలిపే గురువర పలుకవే
బ్రహ్మజ్ఞానివే కవి నీవు ॥దాసుడ॥
(1) పాపిని నేను పావన మూర్తి
వెలుగునిచ్చు జ్యోతివి నీవు
అమర కీర్తివి రమణమూర్తి వి
ఓ గురువరా నీవే జీవము ॥దాసుడ॥
(2) నిన్ను చూచినప్పుడు నాకు నెమ్మది కలుగు
నీదుకై మన్నే బంగారు తండ్రి
పాలలోచన భవభయహరణ
శివశక్తివి నీవు శ్రుత పారిజాతమా ॥దాసుడ॥
(3) దేవర నా మనవి ఆలింపరా
పలికితి పిలిచితి ఓ రమణా
దీన జనావన సంకటహరణ
పాహి శరణం భగవాన్ రమణ ॥దాసుడ॥
Comments
Post a Comment