(165) 13 June (13.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 13 Jun
అంతరంగము ప్రేమతో నిండినప్పుడు ఆవేదన నివేదనగా మారడమే పూజ.
When the inner being is filled with love, grief changes to gift That is Adoration.
165) సాయి నామమను మధురామృతమును (13.06.)
సాయి నామమను
మధురామృతమును
గ్రోలగ రండి జనులారా..... ॥సాయి॥
శాంతి సౌఖ్యముల నందు కొనుచు
ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥
(1) దైహిక బాధల దాడి నెరుంగని
స్థితిని జేరుడో జనులారా.....
లౌకిక వాంఛల లయలు తప్పుకొని
స్థిరతను బొందుడు జనులారా... ॥ శ్రీ సాయి॥
(2) కాంత కనకపు కామ మోహముల
వలలో బడకుడు జనులారా...
శాంతి కొరకు శ్రీకాంతుని మదిలో
చింతన జేయుడు జనులారా.... ॥ శ్రీ సాయి॥
(3) ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల
గలిగి యుండుడో జనులారా.....
శ్యామ చరుణు నీ సూక్తులను
ఆసక్తిగ వినుడో జనులారా.... ॥ శ్రీ సాయి॥

Comments
Post a Comment