(156) 4 June (04.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 4 Jun

నీతిగా, ధర్మంగా ప్రేమగా ఉన్న వారి దగ్గరికి భగవంతుడే వస్తాడు. నిత్యమూ, నిరంతరమూ నామ స్మరణ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లల ప్రవర్తన ఉంటుంది. శిష్యులు చేసే ప్రతి ప్రక్రియ తమ గురువును ప్రతిబింబింప చేస్తుంది.
God Himself comes to those who have ethics righteous love. The name should be memorized continuously and constantly. There will be children's behavior while looking at adults. Every process that the disciples do reflects their teacher. 

156) శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా (04.06.)
శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా
శ్రీ వాణి మహేశ్వరి లలితాది శక్తి రూపా
శ్రీ హనుమ కేశవ నరసింహ మహర్షి రూపా
నాదు నమస్సుమాంజలుల నందుకో సాయి రూపా

ఈ లోక మెల్ల సృజియించెడి దైవ మీవే
పోషించు భారమును భరియించెడి దైవమీవే
చిత్రాతి చిత్రముగ లయించెడి దైవమీవే
నాదు ప్రణామముల నందు కొను దైవమీవే

శరీర కంబులగు బాధల లెన్ని యున్న 
మానసికంబుగ నశాంతు లెనియున్న
విశ్వాస ముంచి 'బాబా 'యని దలచుకొన్న 
సంతోషకరంబులకు సత్ఫలితము లోన గూడు గాదే




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)