(155) 3 June (03.06.)
శ్రీ శారద శ్యామ సందేశం: 3 Jun
మనం పూర్వజన్మలో మనకు
మంచి విషయాలు చెప్పేవారు ఎవరూ లేరు అని ఎంతో మధనపడితే ఈ జన్మలో ఇటువంటి
అవకాశం వచ్చింది. ఆ విషయాలను విని ఆచరిస్తే నీకు సద్వినియోగం అయినట్లు.
అట్లు చేయకపోతే తర్వాత కోట్ల జన్మలెత్తిన అటువంటి సాంగత్యం దొరకదు. మనం
చేసుకున్న పుణ్యం కాస్త తరిగిపోతుంది. దాన్ని ఆచరిస్తే మంచి జన్మలకు అవకాశం
ఉంటుంది. ప్రతి నిమిషమూ నీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరిస్తూ ఉండాలి. అదే
మనకు మార్గం చూపిస్తుంది.
In our previous life,
when we were so brewed that, there was no one who could tell us good
things. Now Such an opportunity came in this life. If you hear and
practice those things, you will benefit. If that is not done, later in
birth crores no such association can be found . The virtue we have done
will somewhat diminish. Practicing it will lead to better births. You
have to remember your favorite divine name every minute. It shows us the
way.
155) శిక్షయో - నీ శిక్షణ యో ! (03.06)
శిక్షయో - నీ శిక్షణ యో !
పరిరక్షణయో సాయీ - ఇది నీ //శిక్షయో//
1. అక్షయముగ నీ అభయ ప్రధానము ఆశ్రితుల నెల్ల గాచుచు నుండగ
నీ రక్షణతో భక్తులెల్లరూ బ్రహ్మా నందము నందు మునుగుచు నుండగ
నీ శిక్షణలో సమర్థ సద్గురు దేవులెందరో లోకముల పాలించుచుండగ
మంద బాగ్యుడై మోహా వేశుడై మూర్ఖునిగా చరియించు వీనికిది //శిక్షయో//
2. నీతినియమములతో చరియించాలని న్యాయ ధర్మముల నడయాడాలని
సకల విశ్వమున సాయిని చూచి సంతసమున సేవించ వలయునని
కోరికలెన్నో ఆశలు ఎన్నియో అంత రంగమును అధివసించగా
దేనిని చేయక ఎందుకు చెందక మూర్ఖునిగా చరియించు వీనికిది //శిక్షయో//
Comments
Post a Comment