1 June (01.06.) (153)
శ్రీ శారద శ్యామ సందేశం: 1 Jun
చిట్టి చిలకమ్మా: ఓ ప్రాణి జీవాత్మ!
అమ్మ
కొట్టిందా: ప్రకృతి మాత తట్టి లేపుతుంది అట కానీ మనం కనుక్కోలేము
తోటకెళ్ళావా?: ఆధ్యాత్మిక తోటకెళ్ళావా? (బాబాగారి దగ్గరికి వెళ్ళటం
లాంటిది)
పండు తెచ్చావా?: అక్కడ జరిగిన ఆధ్యాత్మిక విషయాలు విని హృదయంలో పెట్టుకుని ఆచరించావా? గూట్లో పెట్టావా?: ఆ విషయాలు సాధన చేసి హృదయంలో
పదిలపరచుకున్నావా? గుటుక్కు మింగావా?: ఆచరించి అవగాహన చేసుకున్నావా?
153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా (01.06)
శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా
ప్రేమగ నను కావారా... సాయీశ్వరా//శ్రీకరా //
గురుడవు నీవనీ, దైవము నీవనీ,
గురువే దైవమని సత్యము ధర్మము
సత్పధ మర్మము తెలుపగ వేడిమి
నీ నామామృత పానము చేయుచు
నీవే శరణమని పిలచి పిలచి
నిన్ను కొలచి కొలచి నే నలసిపోయితిని
లేరా దయను చూపి నీ దరిశన మొసగి
హృదయ మందిరము నందు నిలువరా.. పలకరించరా //శ్రీకర //
నిష్ట సబూరుల శిక్షణ నొసగగ
ఇక్కట్టుల కలిగించితివా
సుఖ దుఃఖములలో సమ భావము
కలుగునటుల కరుణించితివా
మొహంబు నెప్పుడు గూల్చెదవో మోదంబు
నెపుడు గూర్చెదవో ఎటుల నీ దరికి జేర్చెదవో
ఎప్పుడు నీలోన నిలిపెదవో నే నెరుగ లేను రా
శ్యామ సన్నుతా... సాయి //శ్రీకర //
ప్రేమగ నను కావారా... సాయీశ్వరా//శ్రీకరా //
గురుడవు నీవనీ, దైవము నీవనీ,
గురువే దైవమని సత్యము ధర్మము
సత్పధ మర్మము తెలుపగ వేడిమి
నీ నామామృత పానము చేయుచు
నీవే శరణమని పిలచి పిలచి
నిన్ను కొలచి కొలచి నే నలసిపోయితిని
లేరా దయను చూపి నీ దరిశన మొసగి
హృదయ మందిరము నందు నిలువరా.. పలకరించరా //శ్రీకర //
నిష్ట సబూరుల శిక్షణ నొసగగ
ఇక్కట్టుల కలిగించితివా
సుఖ దుఃఖములలో సమ భావము
కలుగునటుల కరుణించితివా
మొహంబు నెప్పుడు గూల్చెదవో మోదంబు
నెపుడు గూర్చెదవో ఎటుల నీ దరికి జేర్చెదవో
ఎప్పుడు నీలోన నిలిపెదవో నే నెరుగ లేను రా
శ్యామ సన్నుతా... సాయి //శ్రీకర //

Comments
Post a Comment