(167) 15 June (15.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 15 Jun

బావిలోని నీరు తోడుకోవాలంటే ఆ విధానం తెలుసుండాలి. ఆ విధానం చెప్పే వారు గురువు. అర్హత సంపాదించుకోవాలి. అనుభవంతో తత్వము గురించి తెలుస్తుంది. అమ్మ అంటే ఆకారం కాదు. అది తత్వము. ఇలా భగవంతుని యందు ఉండాలి.
From well to get water, you need to know the procedure. Those who say that approach are called Guru. Must qualify for that. Knowing the philosophy with experience. Mother does not mean shape. That is the philosophy. This is how we should be near God. 


167) సాయి సద్గురు దేవా నాపై  (15.06.)
సాయి సద్గురు దేవా నాపై 
కనికరంబును జూపుమా
దయతో నా హృదయంబు నందున 
నిలచి పాలన జేయుమా ॥సాయి॥

(1) సతతంబు నీదు పాద దాసుల తోడ చెలిమిని గూర్చుమా
సద్గుణంబుల, భక్తి ,శ్రద్దల తోడ బ్రతుకగ జేయుమా
సత్య, ధర్మ పధంబు లందున సాగునటుల దీవించుమా 
సకల విశ్వమునందు నీదగు విశ్వరూపము జూపుమా 
॥సాయి॥

(2) అహము మోహము లందు ద్రోయక నేర్పుగా నడిపింపుమా 
కామ, క్రోధ, లోభాది గుణముల కలుగ నీయక గావుమా
ఎల్లవేళల సాయి నామ స్మరణ మనసున నిలుపుమా
సర్వ మీవే యనుచు నమ్మిన శామదేవుని  బ్రో వుమా 
॥సాయి॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)