(157) 5 June (05.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 5 Jun
తల్లి తన పని
చేసుకోవడానికి పిల్లలు అడ్డం వస్తే బొమ్మలు ఇచ్చి మరిపించి తన పని తాను
చేసుకుంటుంది. బొమ్మలు కాదని తల్లే ఎత్తుకోవాలని ఏడిస్తే చంకలో పెట్టుకుని
పని చేస్తుంది. అలాగే మన భర్త, పిల్లలు, కోరికలు, వ్యామోహలు మొదలగు వాటి
యందు చిక్కుకొనక ఆ పరమేశ్వరుని యందు మనసు నిలిపినచో భగవంతుడు మనకు ముక్తి
ప్రసాదించను.
The mother to do her work, she
gives toys to children and diverts them. And does her work herself. Not
for toys, for mother only if they cry, she works by keeping them in the
armpit. Like this if we not entangling our mind on our husband,
children, desires, passions and so on, keep on that God. God will give
us salvation.
157) శ్రీ సాయి రామ నామ మహిమను చక్కగా (05.06.)
శ్రీ సాయి రామ నామ మహిమను
చక్కగా దెలియుము మనసా !
ఘన సంసారంబుధి దాటగ
జేసేడి మధుర నామమే మనసా !
శ్రీ సాయి నామమే మనసా !
శ్రీ రామ నామమే మనసా ! //శ్రీ //
2. సద్గురువుల చెంతకు నిను చేర్చును
చక్కగా నడుపును మనసా !
భోగభాగ్యముల సుఖసంపదలను
సత్వర మొసగును మనసా ! // శ్రీ //
3. ఆపదలలోన నిన్నాదుకొనుచు
పరిరక్షణ జేయునే మనసా !
ఆనందామృత మందించును
నిన్నలరించును సతతము మనసా ! //శ్రీ//
4 . సాంబశివుడు సద్భక్తితో
రామనామమే దలచును మనసా !
రామ నామము సకల పాపముల
హరిహరించునే మనసా ! //శ్రీ //
Comments
Post a Comment