(173) 21 June (21.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 21 Jun

పిసినారితనము - ఇది పోగొట్టుకోవాలంటే దానగుణం అలవరచుకోవాలి. ఆ దానం చేయునప్పుడు ఈ డబ్బు వాళ్లకు ఉపయోగమా, కాదా? అని ఆలోచించి చేయాలి.
Parsimony: If you want to lose it, you have to adopt charity. When they donating, Is this money useful to them, or not? Should think and do it.


173) సాయి శరణం ౼ సద్గురు శరణం (21.06.)

సాయి శరణం సద్గురు శరణం
సమర్థ సద్గురు సాయిరామ్ శరణం

శ్రీ సాయి శరణం సద్గురు శరణం
సమర్థ సద్గురు చరణం ౼

శ్రీ సాయి దేవా ౼ దేవాధి దేవా ౼
దివ్య ప్రభావా ౼ నన్నేల రావా

తల్లివి నీవై , తండ్రివి నీవై
గురు దైవమీవై నను బ్రోవరావా
నా దిక్కు నీవై , నా మ్రొక్కు నీవే,
నా చిక్కులను దీర్ప వేగమె రావే ౼ ॥

పాపము నెరుగను, పుణ్యము నెరుగను ,
పాపము నందున నను ద్రోయ బోకే

అధర్మ మెరుగను , ధర్మము నెరుగను ౼
అధర్మ మందు నన్నుంచ బోకే ,
అసత్య మెరుగను ౼ సత్యము నెరుగను
అసత్య వాదిగ నన్ను జేయ బోకే ॥

దానము నెరుగను జ్ఞానము నెరుగను
జ్ఞాన దానముల నన్నుంచరావే ౼ ॥

దోసము లైనను మోసము లైనను
జేయంగ నీయక నను గావగ రావే

ఎందు నే నున్న ఏ వేళనైనా ౼
నీ రూప ధ్యానము  జేయంగ నీవే ౼ ॥

ఎటుల బిలచినా ఎప్పుడు బిలచినా
ప్రేమతో నన్ను పాలింప రావే
నా మది లోన కాపుర ముండవే
నీ నామ స్మరణము జేయగ నీవే ౼
నాలోన నీవై నీలోన నేనై నిలచి
బ్రోవగా వరమీయరావే

అభయము నీయవే భయమును బాపవే
అనవరతము నన్నా దరించవే ౼ ॥

ధైర్యము నుంచవే , ధైన్యము దించవే
దరిజేర వేగమే దయజూప రావే
నిష్టయు నేనై , సబూరి నేనై
నీలో నిలిచెడు వరమొకటీ యవే

సత్ కృప జూపవే , సద్గతి నీయవే
శ్యామాదులకు సంతస మీయవే ౼ ॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)