(161) 9 June (09.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 9 Jun
ఎన్ని శాస్త్రాలు,
పురాణాలు, కావ్యాలు, శ్రుతులు, స్మృతులు, వ్యాకరణాదులు చదివి ప్రజలచే
అపరిమితమగు మెప్పును పొందగలిగేటట్లు వివరించగలిగినా, ఉపన్యసించగలిగినా,
రాయగలిగినా, శ్రీ గురుని యందు త్రికరణశుద్ధితో భక్తి కలిగి వినయంతో,
ఓర్పుతో ఆరాధించిన వారికి శ్రీగురుకృప వలన పొందగలిగే ఆనందము వర్ణనాతీతము.
శ్రీ గురుని సంబంధమే నిజమగు సత్సంగము. మిగిలినవన్నీ వ్యర్థములు,
పతనహేతువులు.
No matter how many sciences,
legends, poems, melodies, memories, grammars can be read, in a way
infinite way they can be explained, lectured or written.... On Sri Guru
who have purely devotion with humility and patience admiring him, by his
grace can obtain indescribable joy. The True-companionship (Satsang) is
the real relationship with Sri Guru. Everything else is rubbish, and
indicators of the falling.
161) శ్రీ సాయి రామ నామ మహిమను (09.06.)
శ్రీ సాయి రామ నామ మహిమను
చక్కగ దెలియుము మనసా !
ఘన సంసారంబుధి దాటగ జేసెడి
మధుర నామమే మనసా !
శ్రీ సాయి నామమె మనసా !
శ్రీ రామ నామమె మనసా ! ॥శ్రీ॥
(1) సద్గురువుల చెంతకు నిను జేర్చును
చక్కగ నడుపును మనసా !
భోగ భాగ్యముల సుఖ సంపదలను
సత్వర మొసగును మనసా ! ॥శ్రీ॥
(2) ఆపదల లోన నిన్నాదు కొనుచు
పరిరక్షణ జేయునె మనసా !
ఆనందామృత మందించును
నిన్న లరించును సతతము మనసా ! ॥శ్రీ॥
(3) సాంబ శివుడు సద్భక్తితో
రామనామమె దలచును మనసా !
రామ నామము సకల పాపముల
పరిహరించునే మనసా ॥శ్రీ॥
Comments
Post a Comment