(159) 7 June (07.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 7 Jun

సోమరితనము సాధనకు మహమ్మారి. ప్రతిక్షణము భగవన్నామస్మరణతో గడపడమనేది ప్రయత్నిస్తూ, సత్సంగము, సత్పురుషులతో ఉండడం వలన మనకు తెలియకనే ఆనందమార్గంలో పయనిస్తూ శ్రీ గురుని కృపను పొందగలిగే యోగ్యతను పొందుతాము.
Laziness is the disease for achievement. Trying to spend time with the remembrance of the Lord, and by being with True-companionship and virtuous people, without knowing we walk on the path of bliss, we gain the merit of being able to receive the grace of Sri Guru. 

159) ఇది కల కాదు (07.06.)
ఇది కల కాదు కల్లా కానే కాదు 
ఇది ఆనంద నిలయము కరుణాలయము 
ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము
ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము 

ఇది మా అందరి పాలిట ప్రేమాలయము
దివ్య ప్రేమాలయము కరుణాలయము 
మన కరుణాలయము సాయి కరుణాలయము

1. సతమతమౌ నటుల చేయు 
పిచ్చియోచనలతో  వికలము 
కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో 
తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన 
తరియించగ తపియించుచు నీదరి చేరినదానా 
బాల ననుచు బేలననుచు  జాగుచేయ 
తగునా..తగునా... తగునా ....
శ్యామాచరణ ఓ శారద రమణా 
శ్యామాచరణా హే వందిత రమణా //ఇది కల కాదు//

2. ఏది నీవు  లేనిదేదీ నీవు కానిదేదీ 
నీవు చేయలేనిదేదీ నీవూ అడుగడుగున 
ఆదుకునెడి ప్రేమ స్వరూపా 
అణువణువున నిండియున్న 
దివ్య స్వరూపా పరమ దివ్య స్వరూపా
శ్యామా చరణా ఓ శారద రమణా
మా శ్యామ చరణా హే వందిత రమణా  //ఇది కల కాదు //

3. నీ సన్నిధి లేనపుడు 
నా బ్రతుకే అయోమయం
నీ సన్నిధి ప్రభావమున 
నా బ్రతుకే ప్రేమమయం 

కలకాలం నీ దివ్య సన్నిధిలోనే 
నిలిచిపోని , రాలిపోని, కరిగిపోని 
శ్యామా చరణా హే శారద రమణా
శ్యామా చరణా ఓ శారద రమణ  // ఇది కల కాదు //

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)