(172) 20 June (20.06.)

శ్రీ శారాదా శ్యామ సందేశం: 20 Jun

భగవత్తత్వము గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్లు తెరవాలనిపించదు. లీనమైతే ఏడుపొస్తుంది. సాధన మొదలు పెట్టుకుంటే అదే నడిపిస్తుంది. రాని దాని కొరకు రచ్చల పడనేల. తెలుసుకొని అన్నా చేయి, చేస్తూ అన్నా తెలుసుకో. ఊరకే చేయొద్దు.
Thinking about God-philosophy, doesn't makes you to open eyes. If immerse, we get crying. if you start practicing, the same only leads you.. Don't worry about unknown thing, do after knowing or while doing know, don't do without purpose.


172) సాయి రామా దేవ నాపై దయను జూపవే (20.06.)

సాయి రామా దేవ నాపై దయను జూపవే
దయను జూపవే సాయి దరికి జేర్చవే ॥ సాయి ॥

(1) నీచుడనూ అజ్ఞానుడ ననీ
దోసములను జేసినాడనని
దలచి నను దూరము జేయకు
దయానిధే సాయి రామా

(2) సక్రమమగు నడతయే లేదని
సత్య భాషణయే లేదని
సబూరియు నిష్టయు లేవని
నన్ను  దూరము జేయకు తండ్రి

(3) సోమరిగ బ్రతుకు చుంటినని
బాధ్యతలను గమనించననీ
బాధలలో వేడు చుంటినని
నను దూరము జేయకు స్వామీ

(4) నీ నామమే దలచుచు నుంటిని
నీ కథలనే జదువుచు నుంటిని
నీ లీలలను బలుకుచు నుంటిని
నీ పూజల జేయు చుంటినని

నీవు మెచ్చుకొను తీరుగ
నన్ను బ్రతుక జేయుము దేవా సాయీ
నిన్ను జేరుకొను రీతిగ
నన్ను కరుణతో గనుమా బాబా సాయీ

(6) రామ కృష్ణ శివ దత్త స్వరూపా
రహీము అల్లా ఏసు స్వరూపా
శంకరి మారుతి శ్యామ సన్నుతా
శాంతి ప్రదాత సద్గతి దాతా


 

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)