(160) 8 June (08.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 8 Jun

మనము తనను తెలుసుకోలేమని తెలుసుకున్న పరమాత్మ, తన వారిని ఉద్దరించుటకై తానే ఒక శరీరమును ధరించి, మన మధ్య సంచరించి, తరింపజేస్తారు. కానీ, ఆయన మన మధ్య ఉన్నప్పుడు గుర్తించగలిగే శక్తి కొన్ని కోట్లలో ఏ ఒక్కరికో ఉంటుంది. కరుణామయుడైన శ్రీ గురుడు మన అందరినీ ఆ ఒకనిగా చేయుగాక!
God realised that We don't understand him. To empower his own people he wore a body, wandering among us to enable us. But the power to recognize him when he is among us can be done by one among few crores. May the merciful Sri Guru make us all unified! 


160) హే కరుణా భరణా దయానిధే (08.06.)
 
హే కరుణా భరణా దయానిధే
కల్మష హరణా కృపానిధే
కరుణా భరణా కల్మష హరణా
దయానిధే కృపానిధే 
హే కరుణా భరణా .....

1. భౌతిక వాసనలో  పడియుంటిని
ఆధ్యాత్మికతకు ఆశపడితిని 
భౌతికమునకు ఆధ్యాత్మికతకూ
బంధము నెరుగక కుములు చుంటిని
॥ హే కరుణా భరణా ॥

2. ఒకపరి నీవున్నావనె ధైర్యము 
ఒకపరి తెలియని దేదో అధైర్యము
కలుగుచు నా మది చంచల మగును 
అశాంతితోడ అలమటింతును 
॥ హే కరుణా భరణా॥

3.  నాది నాదనుచు  ప్రాకులాడితిని
ఎన్నెన్నో కార్యముల జేసితిని
నాది కానిదేదో శక్తి కలదని నేటికి తెలుసుకుంటిని
తెలుసుకున్ననూ అవగాహనకు
అందక ఇటు నటు దిరుగుచుంటిని
॥ హే కరుణాభరణా ॥

4. నీ కృప లేనిదె ఏమి జరుగదని 
 నీ కరుణయే నను దరి జేర్చునని
 నీ దయయే నను రక్షించునని
 ప్రేమతో తెలిపిన నీకు దాసుడను 
॥ హే కరుణాభరణా ॥

5.  నీ దాసునిగా నను చేసుకొనుమా
 నీ బిడ్డగ నను బ్రదుక జేయుమా
 నీ మార్గములో నడవ నీయుమా
 నిను ప్రేమించగ శ్యామదేవుని బ్రోవుమ
॥ హే కరుణా భరణా ॥



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)